నకిలీ మొక్కజొన్న విత్తనాలతో నష్టపోయిన గిరిజనుల రైతులకు పరిహారం ఇవ్వాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం విజయనగరం జిల్లా, కార్యదర్శి కొల్లి గంగునాయుడు డిమాండ్ చేశారు. బుధవారం నంద గ్రామంలో మొక్కజొన్న పంట పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నంద గ్రామంలో నకిలీ మొక్కజొన్న విత్తనాలతో గిరిజన రైతులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 15 మంది గిరిజన రైతులు మక్కువలోని ప్రైవేటు వ్యాపారుల వద్ద మొక్కజొన్న విత్తనాలను కొనుగోలు చేశారని, వాటి వల్ల మొక్కజొన్న పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి తాడంగి ప్రభాకర్, రైతులు పాల్గొన్నారు.