ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కియా కార్నివాల్‌ లగ్జరీ సరికొత్త వెర్షన్‌

sports |  Suryaa Desk  | Published : Thu, Oct 03, 2024, 03:57 PM

దక్షిణ కొరియాకు చెందిన వాహన తయారీ సంస్థ కియా మోటార్స్‌ (Kia motors) భారత్‌లో రెండు విలాసవంతమైన కార్లను విడుదల చేసింది. వీటిల్లో విద్యుత్తు ఆధారంగా పనిచేసే ఈవీ9 ఎస్‌యూవీని మార్కెట్‌కు పరిచయం చేసింది.ఈ కారు ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.1.3 కోట్లుగా నిర్ణయించింది. ఇక ఇప్పటికే భారత మార్కెట్‌కు సుపరిచితమైన కియా కార్నివాల్‌ (Kia Carnival) లగ్జరీ ఎంపీవీ సరికొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. పలు అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన ఈ కారు ధర రూ.63.90 లక్షలుగా నిర్ణయించింది. వీటి విశేషాలేంటో చూడండి..


వరల్డ్‌ కార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2024గా ఈ ఏడాది కియా ఈవీ9 (Kia EV9) నిలిచింది. ఆకర్షణీయమైన బాక్సీ షేప్‌లో దీనిని తీర్చిదిద్దారు. ముందువైపు డిజిటల్‌ టైగర్‌ ఫేస్‌ డిజైన్‌తో రూపొందించారు. కారుకు స్లీక్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్‌, స్టార్‌మ్యాప్‌ ఎల్‌ఈడీ అసెంట్స్‌ అదనపు ఆకర్షణలు తెచ్చాయి.ఈ కారు 350 కేవీ డీసీ ఫాస్ట్‌ ఛార్జర్‌తో 10-80శాతం ఛార్జింగ్‌ కేవలం 24 నిమిషాల్లో పూర్తి చేసుకోగలదు.


5.3 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం విశేషం. 700 టార్క్ వద్ద ఈ కారు మొత్తంలో 282.6 కిలోవాట్స్‌ పవర్‌ అవుట్‌పుట్‌ను విడుదల చేస్తుంది. 198 ఎంఎం గ్రౌండ్‌ క్లియరెన్స్‌ దీని సొంతం.ఈ కారులో కియా కనెక్ట్‌ 2.0 వ్యవస్థను అమర్చారు. స్మార్ట్‌ఫోన్లతో కనెక్ట్‌ అయి ఇది రియల్‌టైమ్‌ అప్‌డేట్స్‌, రిమోట్‌ కంట్రోల్‌ ఫీచర్‌ను అందిస్తుంది. కారులోని 44 కంట్రోలర్స్‌ను రిమోట్‌గా ఆపరేట్‌ చేయవచ్చు. ఫోన్‌ ఆధారంగా పనిచేసే డిజిటల్‌ కీ 2.0 వెర్షన్‌ దీనికి అమర్చారు.ఈవీ9 (Kia EV9)లో 12.3 హెచ్‌డీ డిస్‌ప్లే ఇనుస్ట్రుమెంట్‌ క్లస్టర్‌ ఉంది. ఇందులో అత్యాధునిక ట్రినిటీ పనోరమిక్‌ డిస్‌ప్లే సౌకర్యాన్ని ఇచ్చారు. 5 అంగుళాల హెచ్‌డీ హెచ్‌వీఏసీ స్క్రీన్‌, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో ఎంటర్‌టైన్మెంట్‌ సిస్టమ్‌ను అమర్చారు.


ఇక భద్రత విషయంలో 24 అటానమస్‌ అడాస్ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చారు. 10 ఎయిర్ బ్యాగ్‌లు ఈ కారుకు ఉన్నాయి. యూరోఎన్‌క్యాప్‌, ఏఎన్‌క్యాప్‌లో 5 స్టార్‌ రేటింగ్‌ను సాధించింది.


విలాసవంతమైన ప్యాకేజీగా 'కార్నివాల్‌' సెకండ్‌ ఇన్నింగ్స్‌..


 


 సరికొత్త హంగులతో కియా కార్నివాల్‌ (Kia Carnival) భారత వినియోగదారులను మరోసారి పలకరించింది. ఈ సారి దీనిలో అన్ని ఫీచర్లతో కలిసి లిమోసిన్‌ ప్లస్‌ వెర్షన్‌లో అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో దీనికి పోటీనే లేదు. కొత్త కార్నివాల్‌కు తాజాగా 24 గంటల్లోనే 1,822 బుకింగ్స్ రావడం విశేషం.ఈ కారులో స్మార్ట్‌ స్ట్రామ్‌ 2.2 లీటర్స్ 4 సిలిండర్‌ ఇంజిన్‌ అమర్చారు. ఇది 193 పీఎస్‌ శక్తి, 441 టార్క్‌ను విడుదల చేయగలదు. 8 స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ను దీనికి జతచేశారు. ఇందులో ఎకో, నార్మల్‌, స్పోర్ట్‌, స్మార్ట్‌ డ్రైవ్‌మోడ్‌లు ఉన్నాయి.భారీగా కనిపించే ఈ లిమోసిన్‌ 5,155 ఎంఎం పొడవు, 1,995 ఎంఎం వెడల్పు, 1,775 ఎత్తు ఉంటుంది. క్యాబిన్‌లో 2+2+3 సిటింగ్‌ ఉంది.కారు ముందు వైపు కియా టైగర్‌ నోస్‌ గ్రిల్‌, ఐస్‌క్యూబ్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌, స్టార్‌మ్యాప్‌ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ ఫాగ్‌ ల్యాంప్స్‌ ఉన్నాయి. వెనక వైపు హిడెన్‌ వైపర్‌, ఎల్‌ఈడీ ల్యాంప్‌లు అందించారు. 18 అంగుళాల డైమండ్‌ కట్‌ అలాయ్‌ వీల్స్‌ అదనపు ఆకర్షణగా నిలిచాయి. గ్లేసియర్‌ వైట్‌ పెరల్‌, ఫ్యూజన్‌ బ్లాక్‌ వర్ణాల్లో ఇది లభిస్తుంది.


 


కారులో డ్యూయల్‌ టోన్‌ ఇంటీరియర్‌ కనువిందు చేస్తుంది. 12వే పవర్‌ డ్రైవర్‌ సీట్‌, ఫ్రంట్‌ సీట్‌లో వెంటిలేషన్‌, హీటింగ్‌ సౌకర్యాలను అందించారు. రెండో వరుసలో పై రెండు ఫీచర్లతోపాటు లెగ్‌ సపోర్టు కూడా ఉంది.కారులో 3జోన్‌ ఫుల్లీ ఆటోమేటిక్‌ టెంపరేచర్‌ కంట్రోల్‌, ఇన్ఫోటైన్‌మెంట్‌/క్లైమెంట్‌ కంట్రోల్‌ స్వాప్‌ స్విచ్‌, స్మార్ట్‌ పవర్‌స్లైడింగ్‌ డోర్స్‌ ఉన్నాయి, డ్యూయల్‌ పనోరమిక్‌ డిస్‌ప్లేను అమర్చారు. వీటిల్లో ఒక్కోటి 12.3 అంగుళాలు ఉంటాయి. 12 బోస్‌ స్పీకర్లు, 64 వర్ణాల్లో యాంబియంట్‌ మూడ్‌ లైటింగ్‌ వినియోగదారులకు లభిస్తాయి.


ఎనిమిది ఎయిర్‌ బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, హిల్‌ అసిస్టెంట్‌ కంట్రోల్‌, నాలుగు డ్రిస్క్‌బ్రేక్‌లు, ఎమర్సెన్సీ స్టాప్‌ సిగ్నల్‌, వెహికల్‌ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్‌, పార్కింగ్‌ డిస్టెన్స్ వార్నింగ్‌, అడాస్‌ లెవల్‌-2లో 23 అటానమస్‌ సహా పలు ఫీచర్లు లభించనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa