చంద్రబాబు అండ్ కో.. ఇంకా కట్టుకథలు ఆపి పాలనపై, హామీల అమలుపై పెట్టాలని వైయస్ఆర్ సీపీ నాయకుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు హితవు పలికారు. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు అన్నారు,.
దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని సుప్రీం స్పష్టం చేసింది. డైవర్షన్ పాలిటిక్స్ కోసం చంద్రబాబు శ్రీవారిని వాడుకున్నారన్నారు. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న చంద్రబాబు.. తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేశారు. భక్తుల మనోభావాలకు భంగం కలిగింది. గత ప్రభుత్వంపై బురద చల్లి రాద్ధాంతం చేశారు. చంద్రబాబు అండ్ కో ఇంకా కట్టుకథలను ప్రచారం చేస్తున్నారు. వైయస్ జగన్ను తగ్గిస్తున్నామని అనుకుంటూ.. టీటీడీ విశిష్టతను దెబ్బతీస్తున్నారని కన్నబాబు మండిపడ్డారు.