జాతీయరహదారిపై పైడిబీమవరం అమ్మవారి ఆలయం సమీపాన శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రణస్థలం, పూసపాటిరేగ గ్రామానికి చెందిన మురళీ రాజు (38) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పైడిభీమవరం లోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్న మరళీరాజు విధులు ముగించుకుని ద్విచక్ర వాహ నంపై స్వగ్రామం విజయనగరం జిల్లా పూసపాటిరేగ వస్తుండగా.. అమ్మవారి గుడి సమీపాన కుక్క అడ్డంగా రావడంతో అదుపుతప్పి పడిపోయాడు. ఈ ఘటనలో ము రళీరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి భార్య, పిల్లలు ఉన్నారు. మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జేఆర్ పురం ఎస్‌ఐ చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.