గుంతకల్లు పట్టణంలోని సాయినాథ్‌గౌడ్ కాలనీ వెనుక నివాసముంటున్న రైల్వే ఉద్యోగి టీటీఈ జయచంద్ర ఇంట్లో చోరీ జరిగింది. గత నెల 30న ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో నాగపట్నంకు వెళ్లారు. ఊరి నుంచి జయచంద్ర కుటుంబసభ్యులతో శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని చూసి చోరీ జరిగిందని గుర్తించారు. దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువాలోని 45తులాల బంగారు నగలు, 20తులాల వెండి అభరణాలు, రూ. 25వేలు ఎత్తుకెళ్లారని బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ మహేశ్వర్‌రెడ్డి, కసాపురం ఎస్‌ఐ నరేంద్రకుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కసాపురం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.