కడప నగర శివారులోని బుద్దా ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణాలు ఎక్కడ చేపట్టిన అక్రమాలకు ఏదేచ్ఛగా పాల్పడుతున్నారని స్మశానాలు, చెరువులు సైతం వదలడం లేదని బుద్ధ రియల్ ఎస్టేట్ అక్రమాలపై సమగ్రమైన న్యాయ విచారణ చేపట్టాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి కోరారు. సోమవారం కడప ఆర్డీవోను తన కార్యాలయంలో కలసి వినతి పత్రాన్ని అందజేశారు. ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.