తిరుమల తిరుపతి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో నాలుగవ రోజైన సోమవారం రాత్రి కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి సర్వభూపాల వాహనంపై ఊరేగారు.కాళీయమర్దన అవతారంలో తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇచ్చారు. కాగా సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీవారు విహరించారు. ఇక రేపు సాయంత్రం శ్రీవారికి టీటీడీ గరుడసేవను నిర్వహించనుంది. మోహినీ అవతారంలో మలయ్యప్పస్వామి గరుడ వాహనంపై విహరించే కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని టీటీడీ వర్గాలు పేర్కొన్నాయి. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని రేపు సాయంత్రం వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలిపి వేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. కాగా బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు