గుత్తితో పాటు చుట్టుపక్కల పల్లెల్లోని ఆలయాల వద్ద ఉన్న రథాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని సీఐ వెంకటేశర్లు తెలిపారు. ఆలయాల వద్ద ఉంచే రథాలను పరిరక్షించేందుకు నిఘా కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆలయ కమిటీల పెద్దలకు సూచించామన్నారు.
మంగళవారం ఆయన తన ఛాంబర్ లో ఆలయ కమిటీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుత్తి ఆర్. ఎస్, చెర్లోపల్లి తదితర గ్రామాలకు చెందిన ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.