వైసీపీ పాలనలో అనంతపురం నగర వ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేశామని నగర మేయర్ మహమ్మద్ వసీం మంగళవారం అన్నారు.
నాడు-నేడు ద్వారా నగరంలోని అనేక ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల రూపకల్పన చేశామని అన్నారు. కార్యక్రమంలో మేయర్ తో పాటు కార్పొరేటర్లు కమల్ భూషణ్, నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.