ఎచ్చెర్ల మండలం కొయ్యాం పంచాయతీ కొత్త కూర్మనాయుడుపేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి విషంతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎచ్చెర్ల పోలీసులు వివరాల ప్రకారం.. తాగుడు బానిసైనా జీరు పరసయ్య(60)కుటుంబ సభ్యులు తాగొద్దని పలుమార్లు హెచ్చరించడంతో పట్టించుకోలేదు. ఈ క్రమంలో మద్యం తాగి ఇంటికి వచ్చిన తీరుతో కోపగించుకోవడంతో జీవితంపై విరక్తి చెంది విషపూరిత ద్రావణం త్రాగాడు. బుధవారం రిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.