ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2027లో జరిగే గోదావరి పుష్కరాల కోసం రూ.100 కోట్ల నిధులను విడుదల చేసింది.
పుష్కరాల నేపథ్యంలో అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాకు ఈ రూ.100 కోట్లను కేటాయించారు. దీంతో రాష్ట్రంలోని పర్యాటక శాఖ అధికారులు పుష్కరాల పనులను త్వరలోనే ప్రారంభించనున్నారు.