ఏపీకి చెందిన బీజేపీ నేత నిర్వాకం బయటపడింది. సోషల్ మీడియాలో అసభ్యకరమైన వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళతో మీడియా కాల్లో మాట్లాడుతూ అసభ్యకరంగా కనిపించారు. గుంటూరుజిల్లాకు చెందిన నేత వీడియోకాల్లో మహిళతో మాట్లాడారు. ‘రేపు రాత్రికి రా.. ఇప్పుడు కట్టుకొన్న పూలచీరలోనే రా’ అంటూ ఆమెను సదరు నేత కోరడం ఆ వీడియో కాల్లో వినిపించింది.'రేపు ఏడు గంటల కల్లా వచ్చేయ్. ఇద్దరం కలిసి మందు కొడదాం' అన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. ఆ మహిళ కూడా బీజేపీలో కార్యకర్తగా పనిచేస్తుండటం విశేషం.
ఈ వ్యవహారం బీజేపీ నాయకత్వం దృష్టికి వెళ్లింది. బీజేపీ మీడియా వ్యవహారాలు పర్యవేక్షించే నేత ఒకరు దీనిపై విచారణ చేసి.. పార్టీ పెద్దలకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ జిల్లా ముఖ్యనేత వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో పార్టీ ఉలిక్కిపడింది. తాజాగా మరో బీజేపీ నేత వీడియో బయటికి రావడం మరింత కలకలం రేపింది. ఆ ఇద్దరు నేతల వీడియోలు బయటకు రావడం వెనుక సొంత పార్టీ నేతల ప్రమేయమున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో కాల్ వ్యవహారంలో మరో ట్విస్ట్ కూడా ఉంది.. గతంలో గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ నేత ఓ మహిళతో ఫోన్లో మాట్లాడిన ఆడియో వైరల్ అయ్యింది.. ఆ మహిళే ఇప్పుడు బీజేపీ నేతతో మాట్లాడినట్లు సమాచారం. ఆ సమయంలో ఆమె ఒక పార్టీలో ఉండగా.. ఆ తర్వాత బీజేపీలో చేరారు.