ఏపీలో కమీషన్లు, ముడుపులు, దందాలతో టీడీపీ ఎమ్మెల్యేలు దారితప్పారని, 4 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చినట్లు వైయస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పనితీరుపై విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా ఎండగట్టారు,90% మంది టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి పరాకాష్టకు చేరడంతో 4 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక ప్రభావం.
పోస్టింగులకు ఒక రేటు, మద్యంలో నెలమామూళ్లు, వెంచర్లలో కమీషన్లు, కాంట్రాక్టర్ల దగ్గర పెర్సెంటేజిలు, ప్రొటెక్షన్ మనీ, అంటూ బరితెగించిన టీడీపీ ఎమ్మెల్యేలు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ గూఢచారులుగా ప్రవర్తించిన అధికారులకు క్లీన్ చిట్‌లు, మంచిరాబడి ఉన్న పోస్టింగులు, పదోన్నతులు. మద్యంషాపుల దరఖాస్తుల్లో టీడీపీ ఎమ్మెల్యేలు సిండికేట్ అయ్యి సర్కార్ ఖజానాకు గండి . లిటిగేషన్లు, నోటిదురుసులు, వ్యభిచారాలు, ఆమ్యామ్యాలు, మాఫియాలు, దందాలు, బ్లాక్మెయిలింగ్, వెంచర్లు, మద్యం....,.దేన్నీ వదలకుండా టీడీపీ ప్రజాప్రతినిధులు అడ్డగోలుగా దిగమింగే దాంట్లో పూర్తి నిమగ్నం. ఐదు సంవత్సరాల తర్వాత అవకాశం దొరికినప్పుడు మేం మింగితే తప్ప్పేమిటి......మళ్ళీ మళ్ళీ అవకాశం వస్తుందో రాదో .....అని అడ్డంగా సమర్ధించుకుంటున్న తెలుగు తమ్ముళ్లు. టీడీపీ ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలఫై చంద్రబాబు స్పందించి సమాధానం చెప్పాలి. లేనట్లయితే ప్రజాభీష్టం మేరకు శ్వేతపత్రం సమర్పించి విచారణకు ఆదేశించాలని సీఎం చంద్రబాబును విజయసాయిరెడ్డి డిమాండు చేశారు.