ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపే దేవరగట్టులో బన్నీ ఉత్సవం.. అర్ధరాత్రి కర్రల సమరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 11, 2024, 07:57 PM

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం పరిధిలోని హోలగొంద మండలం దేవరగట్టులో కొండపై మాళ మల్లేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి ఏటా విజయదశమి రోజు ఆలయంలో మాత మాళమ్మ, మల్లేశ్వరునికి కళ్యాణోత్సవం జరిపిస్తారు. అనంతరం అర్ధరాత్రి కర్రల సమరం నిర్వహిస్తారు. దీనినే మాళ మల్లేశ్వర స్వామి జైత్రయాత్రగా కూడా పిలుస్తారు. ఎంతో మంది భక్తులు ఈ దేవరగట్టు బన్నీ ఉత్సవంలో పాల్గొని దేవుడి విగ్రహాలను పొందేందుకు వెదురు కర్రలతో తలపడతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com