తెలుగు ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. మంచిపై చెడు గెలిచిన సందర్భంగా దసరా పండగ నిర్వహించుకుంటారని మంత్రి లోకేశ్ తెలిపారు. ఈసారి దానితోపాటు ఏపీలో వైసీపీపై ఎన్డీయే కూటమి గెలిచిన సందర్భంగా పండగ ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎక్స్ వేదికగా దసరా శభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. "తెలుగు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి ప్రజల్ని హింసించిన జగనాసురుడి దుష్టపాలనను ప్రజలే అంతమొందించారు. వైసీపీ చెడుపై కూటమి మంచి విజయం సాధించింది. వరద రూపంలో వచ్చిన విపత్తుపై విజయం సాధించాం. వేలాది ఉద్యోగాలు ఇచ్చే లులూ, ఫాక్స్ కాన్, హెచ్సీఎల్ విస్తరణ, టీసీఎస్ తెచ్చుకున్నాం. పోలవరం సాకారం కానుంది. విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన జరగనుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం చేయూత అందిస్తోంది. ఇన్ని మంచి విజయాలు అందించిన ఈ విజయదశమిని సంతోషంగా జరుపుకుందాం. ప్రజా సంక్షేమం- రాష్ట్ర ప్రగతే ధ్యేయంగా శ్రమిస్తున్న మంచి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు, దుర్గమ్మ ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నా". అని ట్వీట్ చేసారు.