రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి మంత్రి లోకేశ్ ఇటీవల ముంబైలో టాటా సన్స్ బోర్డు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై ఇరువురు చర్చించారు. ఇంకోవైపు.. హీరానందానీ సంస్థల డైరెక్టర్ హర్ష్ హీరానందానీతో సమావేశం అయినట్లు నారా లోకేశ్ ప్రకటించారు. రాయలసీమలో ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఏర్పాటు, విశాఖలో గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్‌లకు ఉన్న అవకాశాలపై చర్చించానని లోకేశ్ పేర్కొన్నారు.