ఏపీలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానం తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించిన ప్రభుత్వం... రేపు లాటరీలో మద్యం దుకాణాలు కేటాయించనుంది. ఈ క్రమంలో, మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా తయారయ్యే విదేశీ మద్యం బాటిళ్ల ఎమ్మార్పీ ధరలను సర్దుబాటు చేస్తూ చట్ట సవరణ చేసింది. చిల్లర సమస్య లేకుండా సర్దుబాటు చేసేలా రూ.10 మేర అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తోంది.ప్రివిలేజ్ ఫీజు ప్రకారం... క్వార్టర్ బాటిల్ ధర రూ.90.50 ఉంటే, ఇకపై అది రూ.100 అవుతుంది. అందులోంచి రూపాయి తగ్గించి, క్వార్టర్ బాటిల్ ను రూ.99కే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎమ్మార్పీ ధర రూ.150.50 ఉంటే, పెంచిన ప్రివిలేజ్ ఫీజు ప్రకారం ఆ ధర రూ.160 అవుతుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.