మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు అమరావతి నియోజకవర్గం ఎమ్మెల్యే సుల్భా ఖోడ్కేపై ఆరేళ్లపాటు సస్పెన్షన్ వేటువేసింది. ఈ ఏడాది ప్రారంభంలో శాసనమండలి ఎన్నికల్లో.. ప్రతిపక్షాల అభ్యర్థి పీడబ్ల్యూపీ నేత జయంత్ పాటిల్ ఓడిపోయారు. ఈ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ చేసిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో సుల్భా ఖోడ్కే ఒకరు.