జమ్మూ కశ్మీర్ సీఎంగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఒమర్ అబ్దుల్లాకు ప్రభుత్వాన్ని నడపడంలో సాయం చేసేందుకు సిద్ధమని ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రకటించారు.
సీఎం అధికారాలు పరిమితంగా ఉండే ఢిల్లీని తాను పదేళ్లు పాలించానని..ఈ క్రమంలోనే జమ్మూకశ్మీర్ పాలన విషయంలో ఏమైనా సమస్యలు వస్తే తనను సంప్రదించాలని ఒమర్‌కు సూచించారు.ఆయన నాయకత్వంలో జమ్మూకశ్మీర్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.