ఆస్ట్రేలియాలోని ఓ పట్టణంలో బంగారం కోసం ముమ్మరంగా వేట కొనసాగుతోంది. సెంట్రల్ క్వీన్స్లాండ్లోని క్లెర్మోంట్ ప్రాంతానికి బంగారం కోసం సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు క్యూ కడుతున్నారు.
దీని కోసం నెలల తరబడి అక్కడే నివాసం ఉండి పసిడి కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. కొంతమంది దీనినే పూర్తిస్థాయి పనిగా మార్చుకుని బంగారాన్ని వెలికి తీసి సొమ్ము చేసుకుంటున్నారు.