మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని CM ఏక్నాథ్ షిండే ఆదేశించారు. సిద్దిఖీ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది.
అనంతరం మృతదేహాన్ని బాంద్రాలోని సిద్దిఖీ నివాసానికి తరలించారు. ఆదివారం రాత్రి ముంబై లైన్స్‌లోని బడా ఖబ్రస్థాన్‌లో సిద్దిఖీ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని పలు పార్టీల నేతలు పరామర్శిస్తున్నారు.