కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో తమపై వస్తున్న అవినీతి ఆరోపణలను టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి ఖండించారు. గ్రూప్ అడ్మిన్లపై పోలీసులకు ఆమె ఫిర్యాదుచేశారు.
గ్రూపుల్లో తాము రిప్లైలు పెడితే.. వాటిని డిలీట్ చేస్తున్నారని ఆమె ఆగ్రహించారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తమపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఆధారాల్లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు.