ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు శుక్రవారం(మహర్నవమి)తో ముగిశాయి. శుక్రవారం మహిషాసురమర్దినీదేవి అలంకారంలో అమ్మ వారు దర్శనం ఇచ్చారు. ఆరోజున కనకదుర్గమ్మ దేవస్థానానికి రూ.84,02,775 ఆదాయం సమకూరింది. 4,149 మంది భక్తులు రూ.500 టికెట్లు కొనుగోలు చేయగా రూ.20,74,500, 1,847 మంది రూ.300 టికెట్లు కొనుగోలు చేయగా రూ.5,54, 100, రూ.100 టికెట్‌తో 4,686 మంది దర్శించుకోగా రూ.46, 86,000 సమకూరింది.
26,584 లడ్డూలను విక్రయించగా, రూ.3,98,760, రూ.100 చొప్పున ఆరు లడ్డూలున్న ప్యాకింగ్ లను విక్రయించగా రూ.44,06,600 సమకూరింది. మొత్తం 2,64,396 లడ్డూలను విక్రయించారు. పరోక్ష ప్రత్యేక కుంకు మార్చన రూ.3000 టికెట్లను 18 మంది కొనుగోలు చేయగా రూ.54వేలు, పరోక్ష ప్రత్యేక చండీహోమానికి రూ.4వేల టికెట్లను ఏడుగురు కొనుగోలు చేయగా రూ.28వేలు, శ్రీచక్ర నవావరణార్చన కోసం రూ.3,000 టికెట్‌ను ఇద్దరు కొనుగోలు చేయగా రూ.6వేలు ఆదాయం వచ్చింది. పబ్లికేషన్లు, ఫొటో లు, క్యాలెండర్ల ద్వారా రూ.10,230, ఇతరత్రా ఆదాయం రూ.20, 545, రూ.40 టికెట్ ద్వారా 9,536 మంది తలనీలాలు సమర్పించగా రూ.3,81,440 ఆదాయం సమకూరింది