మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్ బెయిల్‌కు న్యాయస్థానంలో చుక్కెదురైంది. అతడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను గుంటూరు జిల్లా న్యాయస్థానం కొట్టి వేసింది.
చంద్రబాబు ఇంటిపై దాడి, మరియమ్మ అనే మహిళ హత్య కేసులో నందిగం సురేశ్ నిందితుడిగా ఉన్నారు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో గుంటూరు జైలుకు ఆయన్ను తరలించిన విషయం తెలిసిందే.