విజయవాడ, స్వర్గపురి ఘాట్ సమీపంలో కృష్ణానదిలో ఆదివారం ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు గల్లంతయ్యారు. కృష్ణ లంక పైడయ్య వీధిలోని ఓ ప్రైవేట్ బాలుర హాస్టల్లో ఉంటూ సీఏ చదువుతున్న అవనిగడ్డ సమీపంలోని కొత్తపాలేనికి చెందిన రేపల్లె రాజ్ (20), ప్రకాశం జిల్లా మేదరమె ట్లకు చెందిన పోతినేని కేశవ(21) నెల్లూరుకు చెందిన లెక్కల విష్ణు వర్ధన్(21) ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో కృష్ణాన దిలో సరదాగా స్నానానికి దిగారు.
రేపల్లె రాజ్ నదిలో గల్లంతవ్వగా కేశవ, విష్ణు వర్ధన్ బయ టకు వచ్చారు. కృష్ణలంక పోలీసులు రేపల్లె రాజ్ ఆచూకీ కోసం నదిలో గాలింపు ప్రారం భించారు. పొద్దు పోయేంతవరకు వెదికినా ఆచూకీ తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.