దేవాలయాల్లో పూజలు, సహా ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ విషయంలో కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆయా దేవాలయాల్లో వైదిక కార్యక్రమాలలో ఇతరుల జోక్యం లేకుండా అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఉత్త ర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 500 వరకు ఉన్న దేవాలయాలకు ఈ విధానం అమల్లోకి రానుంది. దేవదా య కమిషనర్ సహా ఏ స్థాయి అధికారి అయినా వైదిక విధుల్లో జోక్యం చేసు కోకూడదని ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో ఆదేశాలు జారీ చేసింది. అర్చకులకు విశేష అధికారాలు కట్టబెట్టిన ప్రభుత్వం. పూజలు, సేవలు, యాగాలు, కుంభాభిషే కాల వంటి వాటిల్లో అధికారుల పాత్రని పరిమితం చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయా దేవాలయాల ఆగమం ప్రకారం వైదిక విధులు నిర్వహించుకు నేలా అర్చకులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వు లు జారీ చేసింది. ఆధ్యాత్మిక విధుల విషయంలో అర్చకులదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది.