మునుపెన్నడూ జరగని విధంగా గ్రామపంచాయతీల అభివృద్ధి అనే నినాదంతో రా ష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ప్రభుత్వం పల్లెపండుగ పేరుతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. అయితే పల్లె పండగ వారోత్సవాల సందడికి చీమకుర్తి మండలం సుదూ రంగా ఉండటం మండలవాసులను కలవరపరుస్తుంది. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సమాధానం గా ప్రభుత్వం చేపడుతున్న ఈ బృహత్తర కార్యక్రమం ని ర్వహణకు నిధులు కేటాయింపు జరగకపోవటంతో మం డల పరిధిలోని 24 పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేప ట్టడానికి వీలులేకుండాపోయింది.
గత ఐదేళ్ల వైసీపీ పాల నలో పంచాయతీలకు నిధుల మంజూరు చేయకపోవటం తో గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే అపరీష్కృతికంగా పేరుకుపోయాయి. అధ్వానంగా ఉన్న రహదారులు, లింక్ రోడ్లు, అస్తవ్యస్తంగా డ్రైనేజీ, దుర్భరంగా ఉన్న శ్మశానాలను సరిచేయటానికి నిధులు లేక అభివృద్ధికి నోచుకోక కునా రిల్లుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం పల్లె ప్రగతికి పట్టం కడుతూ పంచా యతీల అభివృద్ధిపై దృష్టి సారించింది. ఉపాధి హామీ పథ కం కాంపోనెంట్ మెటీరియల్ నిధుల కింద పంచాయతీల అభివృద్ధికి నియోజకవర్గం వారిగా నిధులు కేటాయించింది. వీటిని వినియోగించి చేపట్టాల్సిన అత్యవసర పనులపై ఆ గస్టు 21న ప్రతి పంచాయతీ పరిధిలో గ్రామసభలు నిర్వ హించి తీర్మానాలు చేశారు. ఈ మేరకు నియోజకవర్గంలో ని నాలుగు మండలాలకు రూ.15కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. వాటితో సోమవారం నుంచి పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్ట నున్నారు. ప్రతి గ్రామంలో సీసీరోడ్లు, బీటీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతోపాటు నీటి సంరక్షణా ట్రెంచ్‌లను ఏర్పాటు చే యనున్నారు.
అయితే ఈ కార్యక్రమంలో చీమకుర్తి మండ లానికి చోటుదక్కకపోవటం చర్చనీయాంశంగా మారింది. దీంతో మండల పరిధిలో సమస్యల పరిష్కారానికి మార్గం మూసుకుపోయినట్లయింది. బహుశా రాష్ట్రంలోనే పల్లెపం డుగ సందడి లేని మండలం చీమకుర్తి ఒక్కటే కన్పిస్తోంది. దీనికి కారణం నియోజకవర్గానికి కేటాయించిన రూ.15కోట్ల నిధుల కేటాయింపులో చీమకుర్తిని పక్కన పెట్టారు. మం డల పరిషత్‌కు గ్రానైట్ సెస్ రూపంలో సమకూరే నిధులు పుష్కలంగా ఉండటంతో ఎమ్యెల్యే బీఎన్.విజయ్‌కుమార్ చీమకుర్తి మండలాన్ని మినహాయించి మిగతా మూడు మండలాలకు కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈక్రమంలో పల్లెపండుగ కార్యక్రమాన్ని మండ ల పరిఽధి లో అమలు చేయలేని పరిస్థితి నెలకొంది.