గుంతకల్లు పట్టణంలోని దోనిముక్కల రోడ్డులో నివాసముంటున్న రాబీ (26)అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. రూరల్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రాబీ భర్త మహమ్మద్ ప్రస్తుతం కోలార్ జైలులో ఉన్నారు. ఆర్థిక, కుటుంబ సమస్యల కారణంగా రాబీ నిత్యం మదన పడుతుండేది.
ఈ క్రమంలో ఆదివారం తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ఇంట్లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.