యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన మరో హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని బోయ, వాల్మీకి సోదరులు యువగళం పాదయాత్రలో తనను కలిసి విన్నవించారన్నారు.
వారి సెంటిమెంటును గౌరవిస్తూ వాల్మీకి జయంతిని ఈనెల 17వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, అదే రోజు అనంతపురంలో రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతిని నిర్వహిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ బీసీల పుట్టినిల్లని.. వారి ఆత్మ గౌరవాన్ని పెంచే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని నారా లోకేస్ పేర్కొన్నారు.