సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టి వెంటనే కఠినంగా శిక్షించాలని సోమవారం సీఐటీయూ శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ దిల్షాద్ డిమాండ్ చేశారు.
నల్లబొమ్మినపల్లి గ్రామ సమీపంలో ఉపాధి కోసం వలస వచ్చిన అత్త, కోడలి పై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన బాధాకరమన్నారు. ఇలాంటి ఘటన పునరుతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.