పెనుకొండ పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయ వై జంక్షన్ వద్ద పరిసరాల సుందరీ కరణ, బస్ షెల్టర్ నిర్మాణ పనులను మంగళవారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పరిశీలించారు.
మంత్రి సవితమ్మ అధికారులు, నాయకులతో కలసి అభివృద్ధి పనుల పై చర్చించారు. ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.