పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా బారులు తీరారు. మంగళవారం సాయంత్రం మూడు గంటలకు సినిమాను రథోత్సవాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. 2వేల మంది పోలీసులతో విస్తృతమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు ఉచిత దర్శనాలు ఏర్పాటు చేసింది. కాగా విజయనగరం పైడితల్లి అమ్మవారి తొలేళ్ల తంతు పూర్తయింది.. అశేష జనవాహిని అత్యంత భక్తిశ్రద్ధలతో తిలకించే సిరిమాను సంబరాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం సాయంత్రం 3 గంటలకు సిరిమాను బయలుదేరనుంది. ఇందుకు అనుగుణంగా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. అమ్మవారి పరివారంగా పిలిచే జాలరి వల, అంజలి రథం, పాలధార రథాలు సిరిమాను వెంట నడుస్తాయి. సాయంత్రం ఆరు గంటల సమయానికి సిరిమానోత్సవాన్ని పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉదయం పట్టు వస్త్రాలు సమర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa