ఇరాన్‌పై ప్రతిదాడి చేస్తే ఆ తర్వాత చోటు చేసుకొనే పరిణామాలకు ఇజ్రాయెల్ బాధపడాల్సి ఉంటుందని ఐఆర్జీసీ చీఫ్ హసన్ సలామీ హెచ్చరించారు.
ఇటీవల ఇజ్రాయెల్ దాడిలో చనిపోయిన ఓ జనరల్ అంత్యక్రియల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవలే ఇజ్రాయెల్‌పై ఇరాన్ రాకెట్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే.