పొరుగుదేశం పాక్ అనుకూల నినాదాలు చేసిన వ్యక్తికి బెయిల్ మంజూరు సందర్భంగా మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అతడిలో దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కేసు విచారణ ముగిసేవరకు పోలీస్‌స్టేషన్‌లో జాతీయ జెండాకు సెల్యూట్ చేయాలని,.
‘భారత్ మాతాకీ జై’ అని నినాదాలు చేయాలని ఆదేశించింది. నెలలో రెండుసార్లు ఇలా చేయాలంటూ ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.