బహిరంగ మార్కెట్‌లో ఆయిల్ ధరలు, నిత్యా వసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా యి. బియ్యం ధరలు మండిపోతున్నాయి. అధి కారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిత్యా వసర సరకులు ధరలను నియంత్రించాలనే ఉద్దే శ్యంతో ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మొదటగా అతి ముఖ్యమైన ఆయిల్ ధరలను నియంత్రించడానికి ప్రత్యేక కౌంటర్లు ద్వారా సబ్సిడీ ధరలకు ఆయిల్ ప్యాకెట్లను విని యోగదారులకు ఆందిస్తోంది. ఈ ధరలను నియంత్రించడానికి చౌకడిపో దుకాణాల్లో అం దించే సరుకులతో పాటు జిల్లాలో ప్రత్యేకంగా 32 కౌంటర్లు ఏర్పాటు చేసి పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్స్, తక్కువ ధరకు కందిపప్పు అం దిస్తున్నారు.
ఏలూరులోని రెండు రైతు బజార్లు, నూజివీడు, కైకలూరులోని రైతు బజార్లు ద్వారా మోర్, డిమార్ట్, రియలన్స్ మార్టులకు సంబంధించి 11 చోట్ల, మిగిలినవి చింతలపూడి, జంగా రెడ్డిగూడెంతో పాటు ఇతర మండల కేంద్రా ల్లో మొత్తం 32 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి అయిల్స్, బియ్యం, కందిపప్పు సరుకులను బహి రంగ మార్కెట్‌కన్నా తక్కువగా అందిస్తున్నారు. జిల్లాలోని హోల్ సేల్ ఆయిల్స్, నిత్యావసర సరు కుల అమ్మే హోల్‌సేల్ వర్తకులతో మాట్లాడి ఈ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధా నంగా ఒక్కో రేషన్ కార్డుదారునికి నెలలో ఒక ప్యాకెట్ సన్ ఫ్లవర్ ఆయిల్, మూడు ప్యాకెట్లు పామాయిల్‌ను సబ్సిడీ ధరలకు అందిస్తున్నారు. సన్ ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ రూ.124 చొప్పున, పామాయిల్ ప్యాకెట్ రూ.110 చొప్పున అంద జేస్తున్నారు. కందిపప్పు కిలో రూ.150, సూపర్ ఫైన్ బియ్యం కిలో రూ.47లకు ఈ ప్రత్యేక కౌంటర్లలో అందజేస్తున్నారు. ఇవిగాక చౌకడిపో ల ద్వారా సబ్సిడీ ధరకే కందిపప్పు, పంచదార, ఉచితంగా బియ్యం అందజేస్తున్నారు.