ములకల చెరువులో 14వ తేదీన ఆంజనేయ స్వామి దేవాలయం ధ్వంసం కేసును పోలీసులు ఛేదించారు. ఆలయం పూజారి విద్యాసాగర్ మరొక ఆలయం పూజారి హరినాథ్ మధ్య జరిగిన ఆధిపత్యం పోరులో ఆంజనేయ స్వామి గుడిని ధ్వంసం చేశారని గురువారం పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో ఆరుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి కారు, పేలుడు పదార్థాలు, ఇనుప పనిముట్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa