విష విజ్వరంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బాలాయపల్లి మండలంలోని వెంకటరెడ్డిపల్లి గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం మేరకు. వెంకటరెడ్డిపల్లికి చెందిన వల్లెపు ప్రసాద్ (35)ఈనెల 13న అనారోగ్యానికి గురయ్యారు. ఈ మేరకు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వైద్యుడిని సంప్రదించగా మరుసటి రోజుకి ప్రసాద్ ఆరోగ్యం క్షీణించింది. గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రసాద్ మృతిచెందాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa