బీజేపీపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని, హీరోయిజం చూపించవద్దని ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి మాజీ మంత్రి నాగేంద్రకు సూచించారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనతో సహా గత యూపీఏ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్న అనిల్ లాడ్, ఆనంద్‌సింగ్, సురేశ్‌బాబు, నాగేంద్ర సతీశ్ శైల్ తదితరులు సీబీఐ అరెస్టు చేయడం కారణంగా జైలులో ఉన్న సంగతి మర్చిపోవద్ధన్నారు. మళ్ళీ మంత్రి కావాలనుకునే నేపథ్యంలో బీజేపీపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. వాల్మీకి కార్పోరేషన్ కుంభకోణలో విమాన టిక్కెట్లు, ఇంటి ఖర్చుల కోసం కార్పోరేషన్ డబ్బును వినియోగించినట్లు ఈడీ సమర్పించిన చార్జిషీట్‌లో పేర్కొందన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు ముగ్గురు ఎమ్మెల్యేలు భరత్‌రెడ్డి, గణేశ్, కూడ్లిగి ఎమ్మెల్యే శ్రీనివాసులు రూ 1480కోట్లు కేటాయించారని, కార్యకర్తలకు ఒక్కొక్కరికి పదివేలు అందజేశారని, ఇదంతా ఈడీ రికార్డుల నుంచి తెలిసిందన్నారు. ఎన్నికల కోసం మొత్తం రూ. 20కోట్లు వినియోగించారన్నారు. వాల్మీకి, వక్ప్, సిద్దార్ధట్రస్ట్, ముడాతోపాటు గత 15 నెలల్లో కాంగ్రెస్ అనేక కుంభకోణాల్లో కూరుకుపోయిందన్నారు. ఇది బ్యాంకు స్కాం అని చెప్పడానికి సిగ్గుపడాలన్నారు.