గూగుల్ కొత్త చీఫ్ టెక్నాలజిస్ట్‌గా భారత సంతతికి చెందిన ప్రభాకర్ రాఘవన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఆయన 2012లో యాహూలో పనిచేశారు. 2018లో గూగుల్ సెర్చ్, అసిస్టెంట్, జియో, యాడ్స్, కామర్స్, పేమెంట్స్ ప్రొడక్ట్‌ల సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రభాకర్ రాఘవన్ 1981లో మద్రాసులోని ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేశారు.