హర్యానాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పంచకుల సమీపంలోని టికార్ తాల్ ప్రాంతంలో స్కూల్ బస్సు అదుపుతప్పి కాలువలో పడింది. ఈ ఘటనలో పలువురు చిన్నారులకు తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చికిత్స నిమిత్తం చిన్నారులను హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa