బాపట్ల మండల పరిషత్ కార్యాలయం వద్ద శనివారం డ్వాక్రా సంఘాల ఆధ్వ్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని సంఘాల అభివృద్ధికి సిబ్బంది కృషి చేయాలని సూచించారు. కమిషనర్ రఘునాథరెడ్డి, పట్టణ టిడీపి అద్యక్షులు గొలపల శ్రీనివాసరావు, అధికారులు, డ్వాక్రా సంఘాల సభ్యులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.