పులిచింతల ప్రాజెక్టుకు ఆదివారం వరద ప్రవాహం పెరుగుతుంది. దీంతో నాలుగు రేడియల్ గేట్లు ఎత్తి 1, 03, 162 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తికి 16, 000 కలిపి 1, 19, 162 క్యూసెక్కులు దిగువకు ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నట్లు ఏఈ రాజు తెలిపారు. ఎగువ నాగార్జునసాగర్ పరివాహ ప్రాంతం నుంచి 1, 34, 933 క్యూసెక్కులు వచ్చి చేరిందన్నారు. ప్రాజెక్టులో 45. 67 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.