రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం టక్కోలి పంచాయతి తాత్కాలిక సర్పంచ్ గా లక్ష్మీదేవిని నియమించారు. టక్కోలి పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్ రాజీనామా చేయడంతో తాత్కాలికంగా ఆదివారం లక్ష్మీదేవిని సర్పంచ్ గా ఎన్నుకోవడం జరిగింది. లక్ష్మీదేవిని సర్పంచ్ గా నియమించడంతో పంచాయతీ సర్వతోముఖాభివృద్ధి చెబుతుందని మెజారిటీ వార్డు మెంబర్లు తెలిపారు. గత మూడు నెలలుగా సర్పంచ్ లేక అభివృద్ధి కుంటుపడింది అన్నారు.