పుంగనూరులో చిన్నారి దారుణ హత్యపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఎంపీ మాట్లాడుతూ ఏపీలో శాంతిభద్రతలపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు.
ఇటీవల కర్నూలులో ఒక అమ్మాయి మిస్ అయితే కనీసం పట్టించుకోలేదని, ఇప్పుడు పుంగనూరులో చిన్నారి అస్పియ మృతి దారుణం అని అన్నారు. ప్రశాంతంగా ఉన్న పుంగనూరులో ఇటువంటి ఘటన అందరినీ కలచివేసిందన్నారు. మంత్రులు వారి బాధ్యతలు మరిచి ఇతర విషయాలపై ఫోకస్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.