ఉరవకొండ మండలం చిన్న ముష్టూరు గ్రామంలో ఆదర్శ పాఠశాల మరియు పాలిటెక్నిక్ కళాశాల కోసం రహదారి ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్కు వినతి పత్రం అందించింది. అధికారులు హనుమంతు రాయుడు, కుళ్లాయిస్వామి చెప్పారు.
కళాశాల ఏర్పాటు తరువాత విద్యార్థులు, ఉపాధ్యాయులు రహదారుల ఎడల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో ఇది మరింత తీవ్రంగా ఉంది. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.