ఉరవకొండ పట్టణంలో జరిగిన సమావేశంలో, మలేరియా సబ్ యూనిట్ అధికారి భక్తుల కోదండరామిరెడ్డి, గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌస్ సాహెబ్ సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు.
వార్డు సభ్యులు ప్రతి శుక్రవారం "డ్రై డే" పాటించాలి, నీటి పాత్రలను పరిశుభ్రంగా ఉంచాలని, దోమల గుడ్లు నశించడానికి ఈ చర్యలు అవసరమని చెప్పారు. ఇంట్లో దోమలు రాకుండా కిటికీలకు మెసులు బిగించాలని సూచించారు, తద్వారా వ్యాధులు తగ్గుతాయని తెలిపారు.