రామసముద్రం మండలం ఆర్. నడింపల్లి పంచాయతీ ఆర్. కమతంపల్లిలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ సి. వెంకటసుబ్బయ్య తెలిపారు.
ఆర్. కమతంపల్లికి చెందిన ఎనిమిది మంది గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో సోమవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని రూ. 8450 నగదు, స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa