కడప కలెక్టర్ లోతేటి శివశంక్‌కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఐఏఎస్ క్యాడర్ విభజనలో తనకు అన్యాయం జరిగిందని డీఓపీటీ ఇచ్చిన ఉత్తర్వులను శివశంకర్ సవాలు చేశారు. తనను తెలంగాణకు కేటాయిస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
క్యాట్, హైకోర్టు తన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టును కడప కలెక్టర్ శివ శంకర్ ఆశ్రయించారు. శివశంకర్ పిటిషన్‌పై జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ బట్టి ధర్మాసనం విచారణ జరిపింది. వాదనల అనంతరం శివశంకర్ పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. క్యాట్, హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేడర్ డివిజన్ చేస్తూ డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.