బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. పారాదీప్‌కు ఆగ్నేయంగా 700 కిలోమీటర్లు, సాగర్ ద్వీపానికి దక్షిణ - ఆగ్నేయంగా 750 కిలోమీటర్లు, ఖేపుపరా కు ఆగ్నేయంగా 730 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ - వాయువ్య దిశగా పయనించి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపు (బుధవారం) తుఫానుగా మారే అవకాశం ఉంది. వాయువ్య దిశగా కదులుతూ ఈనెల 24వ తేదీకి తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం ఉంది. ఈనెల 24వ తేదీ రాత్రి లేదా 25వ తేదీ ఉదయం పూరీ , సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు సమాచారం.