విజయనగరం జిల్లా, జామి మండల కేంద్రమైన జామిలో మంగళవారం ని ర్వహించిన సోషల్ ఆడిట్ గ్రామసభ రసాభాసగా మారింది. ఏపీవో కిరణ్మయి ఆధ్వ ర్యంలో నిర్వహించిన ఈసభలో పలువురు యువకులు మాట్లాడుతూ ఉపాధి పనుల్లో చాలావరకు అక్రమాలు జరిగాయని ఆరోపించారు. గ్రామానికి చెందిన ఈశ్వరరావు అనే యువకుడు గ్రామసభలో మాట్లాడుతూ మండలకేంద్రం అప్పన్నపాలానికి చెంది న శిరికి రవికుమార్ సింగపూర్‌లో ఉంటే ఇక్కడ మస్తర్లు వేశారని, వలంటీరుగా పని చేసిన మిడతాన శ్రీను మూడురోజులు మాత్రమే ఉపాధి పనుల్లో పాల్గొనాలనే నిబంధన ఉన్నప్పటికీ సదరు వ్యక్తి వారంలో ఆరురోజులు నిబంధనలకు విరుద్ధంగా పనిచేసినట్లు మస్తర్లువేశారని, గ్రామంలో సైకిల్‌షాప్, బెల్ట్ షాప్ పెట్టుకున్న వ్యక్తి ఉ పాధి పనికి రాకపోయిన మస్తర్లు వేశారని, సుంకరి ఎర్నాయుడు చెరువు పనికి రాక పోయినా వచ్చినట్టు చూపి ఏడువారాలకు ఏడు వేలు రూపాయలు పొందాడని, డేరా ల పద్మానాభం అనే టైలర్ విషయంలోనూ ఇలానే చేశారని, ఇలా బోలెడు అక్రమా లు జరిగాయని ఆరోపించారు. తాము ఈవిషయాలపై జిల్లా అధికారులకు ఫిర్యాదుచే స్తామని తెలిపారు. ఇక్కడ ఆడిట్ సభ నిర్వహిస్తున్న ఎస్‌ఆర్‌పీ, డీఆర్‌పీ అక్రమాలకు అండగా ఉన్నారని ఆరోపించారు. పనికి రానివారికి మస్తర్లు వేసి ప్రజాధనం దుర్విని యోగం చేశారని, ఇక్కడ లేని వ్యక్తులకు మస్తర్లు వేసి వారిపేరు మీద డబ్బులు పెద్ద ఎత్తున స్వాహా చేశారని ఆరోపించారు. ఈవిషయాలపై ఏపీవో కిరణ్మయి వివరణ కోరగా అంతా గందరగోళంగా మారిందని, తనకు ఏమీ వినిపించలేదని ఎస్‌ఆర్‌పీ, డీ ఆర్‌పీ ఇచ్చే నివేదిక చూశాక వీటిపై విచారణ చేస్తామన్నారు.